HomeMovie News Teluguబన్నీ లెక్క అదిరిందహో

బన్నీ లెక్క అదిరిందహో

కలెక్షన్లంటే వసూళ్ళు మాత్రమే కాదనీ, అందులో అభిమానాన్ని చూడాలని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరికొత్త నిర్వచనిమిచ్చాడు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ అంటే అది కలెక్షన్స్‌తోనే కనెక్ట్‌ చేసి మాట్లాడుతున్నారు. అందుకే బన్నీ ఇలా స్పందించి ఉంటాడు. నెగెటివ్‌ రివ్యూలు వచ్చినా ‘డిజె దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా మంచి విజయాన్ని అందుకుందని బన్నీ చెప్పాడు. అభిమానులందరికీ తన సినిమాని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు అల్లు అర్జున్‌.

అభిమానులు, ప్రేక్షకులు సినిమాని సక్సెస్‌ చేశారనీ, ఇది సక్సెస్‌ మీట్‌ కానే కాదని చెప్పిన అల్లు అర్జున్‌ సక్సెస్‌ చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పుకోవడానికే ఈ మీట్‌ని ఏర్పాటు చేశామన్నాడు. ఇంకో వైపున సినిమాని పైరసీ భూతం వెంటాడుతోందంటూ పైరసీపై కూడా అల్లు అర్జున్‌ గట్టిగానే స్పందించాడు. సోషల్‌ మీడియాలో ‘డిజె’ వీడియోలు దర్శనమిస్తున్నాయి. దర్శక నిర్మాతల హెచ్చరికల్ని బేఖారతు చేస్తూ పైరసీదారులు సినిమాని పైరసీ చేసేశారు. అలాగే సినిమాని ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ న్యాయస్థానంలో కేసు నమోదయ్యింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్‌ అయ్యిందంటున్నాడు బన్నీ. అలాగే వసూళ్ళపై కూడా అల్లు అర్జున్‌ ఇచ్చిన క్లారిటీ అదిరిందహో అని చెప్పవచ్చు. కలెక్షన్ల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయడం మామూలే. కానీ ఆ వసూళ్ళు అభిమానానికి గుర్తు అని బహుశా ఇంతకు ముందు ఎవరూ చెప్పలేదేమో. అందుకే ఈ విషయంలో బన్నీ స్టైల్‌ అదిరిందహో! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular