HomeMovie News Teluguఎన్టీయార్‌ కొల్లగొట్టేశాడంతే

ఎన్టీయార్‌ కొల్లగొట్టేశాడంతే

బుల్లితెరపై ఎన్టీయార్‌ ఎలా ఉంటాడోనని ఎవరికన్నా చిన్న చిన్న అనుమానాలుంటే అవి పటాపంచలైపోవాలి. ‘బిగ్‌ బాస్‌’ తెలుగు టీవీ షోలో హోస్ట్‌గా కనిపించనున్న ఎన్టీయార్‌, ప్రోమోస్‌తో అదరగొట్టేస్తున్నాడు. స్టార్‌ హీరోలు బుల్లితెరపై సందడి చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. మొన్న నాగార్జున, నిన్న చిరంజీవి, ఇప్పుడు ఎన్టీఆర్‌. మరో పక్క భళ్లాలదేవ కూడా ఆల్రెడీ స్టార్ట్‌ చేసేశాడు. ఇలా టీవీ షోస్‌ పట్ల హీరోలు ఇంట్రెస్ట్‌ చూపించడం ఆహ్వానించదగ్గ విషయం.

ఇక ఎన్టీఆర్‌ షో విషయానికి వస్తే ఈ షో మీద ఇంతవరకూ ఉన్న అంచనాలు, ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేస్తున్న ప్రోమో వీడియోస్‌తో మరింత పెంచేస్తున్నాడు. ‘బిగ్‌ బాస్‌’ షో అంటే అందులో సీక్రెట్‌ కెమెరాల వ్యవహారముంటుంది. ఇన్‌ హౌస్‌ కెమెరా ఉంటుంది పార్టిసిపెంట్లను గమనించేందుకు. దాన్ని బేస్‌ చేసుకుని కొత్త ప్రోమోని రిలీజ్‌ చేశారు. సీక్రెట్‌ కెమెరాలు నా రూమ్‌లో పెట్టిందెవరు? అంటూ ఎన్టీఆర్‌ ఆ ప్రోమోలో చెప్పిన డైలాగ్‌, ప్రదర్శించిన హావభావాలు సింప్లీ సూపర్బ్‌. ఫస్ట్‌ లుక్‌ ఫొటోతోనే సత్తా చాటిన ఎన్టీయార్‌, ప్రోమోలో ఇంకా అదరగొట్టేశాడు.

ప్రోమోసే ఈ రేంజ్‌లో ఉంటే ఇక ఈ షో ఎంతగా ఆకట్టుకోనుందో అంటూ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ ‘బిగ్‌బాస్‌’ గేమ్‌ ఫుల్‌ షోలో ఎన్టీయార్‌ ఏ స్థాయిలో సత్తా చాటుతాడో చూడాలిక. మరో పక్క ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular