HomeMovie News Teluguకాజోల్‌ ఛాలెంజ్‌ చేసింది

కాజోల్‌ ఛాలెంజ్‌ చేసింది

బాలీవుడ్‌ భామ కాజోల్‌ గ్లామరస్‌గా కనిపించి, కుర్రోళ్ల మనసును దోచేసింది. హీరోయిన్‌గా ఆమె కెరీర్‌లో సాధించిన డెవలప్‌మెంట్స్‌ అన్నీ ఇన్నీ కావు. అద్భుతమైన సక్సెస్‌లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే చాలా కాలంగా కాజోల్‌ సినిమాల్లో నటించడం లేదు. ఇటీవలే ‘దిల్‌సే’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించింది. బాలీవుడ్‌ హిట్‌ పెయిర్‌ అయిన షారూఖ్‌తో జతకట్టింది ఈ సినిమాలో. అప్పటికీ, ఇప్పటికీ అదే అందం ఈ ముద్దుగుమ్మది. అలాగే ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

కానీ తాజాగా కాజోల్‌ నటించిన సినిమా హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత కాజోల్‌ సౌత్‌లో నటిస్తోన్న సినిమా ఇది. సౌందర్యా రజనీకాంత్‌ డైరెక్షన్‌లో ధనుష్‌ హీరోగా నటిస్తోన్న ‘విఐపీ 2’లో కాజోల్‌ ప్రతినాయిక పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కాజోల్‌నే ఛాలెంజ్‌ చేసిన పాత్రట. అంత గొప్పగా డిజైన్‌ చేసింది డైరెక్టర్‌ సౌందర్యా రజనీకాంత్‌. ఆమె నటన మైండ్‌ బ్లోయింగ్‌ అంటున్నాడు హీరో ధనుష్‌. కార్పొరేట్‌ కనస్ట్రక్షన్‌ దిగ్గజంగా నటిస్తోంది కాజోల్‌ ఈ సినిమాలో.

తెలుగులో విడుదలైన ‘రఘువరన్‌ బీటెక్‌’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఘన విజయం అందుకుంది ఈ సినిమా. కాజోల్‌ గ్లామర్‌ అదనపు ఆకర్షణగా నిలవనుంది ఈ సీక్వెల్‌కి. అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుసగా సౌత్‌ సినిమాలపై దృష్టి పెట్టాలనుకుంటోందట కాజోల్‌. ఆమెకి బాలీవుడ్‌లోనే కాదు సౌత్‌లోనూ పిచ్చ క్రేజ్‌ ఉంది. ఆమె నటిస్తానంటే అంతకంటేనా! హార్ట్‌ ఫుల్‌గా వెల్‌కమ్‌ చెప్పేస్తారు సౌత్‌ ఆడియన్స్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular