HomeMovie News Teluguఉయ్యాలవాడ మెగా అప్‌డేట్‌ ఇదే

ఉయ్యాలవాడ మెగా అప్‌డేట్‌ ఇదే

చిరంజీవి 151వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగా కాంపౌండ్‌లో మెగా మూవీగా ఈ సినిమా రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రామ్‌ చరణ్‌ నిర్మించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న రెండో చిత్రమిది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగష్టులో ఈ సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. కాగా ఈ సినిమాని వచ్చే నెల సమ్మర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉందట. హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌ ఉండబోతున్నాయట. చరిత్రని కళ్లకి కట్టినట్లు చూపించడంతో పాటు కమర్షియల్‌ సినిమాకి ఉండాల్సిన అన్ని హంగులూ ఈ సినిమాలో ఉండనున్నాయట. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారు.

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఈ సినిమా ఉండబోతోందట. ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ సినిమా తెచ్చిన కీర్తి ప్రతిష్ఠలకి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దాసోహం అంది. ఆ స్థాయిలో మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పేలా ఈ సినిమాని రూపొందించబోతున్నారట. తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి. ఆయన చరిత్ర ప్రపంచానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular