HomeMovie News Teluguఎన్టీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు ఇదేనా?

ఎన్టీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు ఇదేనా?

ఎన్టీఆర్‌ చిన్నప్పటి నుండీ క్లాసికల్‌ డాన్సర్‌ అన్న సంగతి తెలిసిందే. ఆయనకున్న క్లాసికల్‌ డాన్స్‌ ప్రావీణ్యంతోనే డాన్సులో ఎలాంటి స్టెప్‌ అయినా ఈజీగా వేసేయగలడు. అయితే ఎన్టీఆర్‌ తాజా చిత్రం ‘జై లవ కుశ’ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఓ పాత్ర ఖచ్చితంగా డాన్స్‌ని అమితంగా ప్రేమించే క్యారెక్టర్‌ అని తెలియ వస్తోంది. గతంలో చిరంజీవి త్రిపాత్రాభినయంలో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో కూడా చిరు ఓ పాత్రలో క్లాసికల్‌ డాన్సర్‌గా కనిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా అదే తరహా పాత్రలో నటిస్తున్నాడంటూ గాసిప్స్‌ బాగా వినిపిస్తున్నాయి.

అయితే చిత్ర యూనిట్‌ మాత్రం ఆ సినిమాకీ, ఈ సినిమాకీ పోలిక ఉండదనీ, ఈ సినిమా స్టోరీ పూర్తి విభిన్నంగా ఉంటుందనీ అంటోంది. అయితే ఎన్టీఆర్‌ ఒకవేళ ఈ సినిమాలో డాన్సర్‌గా నటిస్తే ఆయన డ్రీమ్‌ ప్రాజెక్టు నెరవేరినట్లే అనుకోవాలి. ఎందుకంటేె ఎన్టీఆర్‌కి పూర్తి స్థాయి క్లాసికల్‌ డాన్సర్‌గా నటించాలనే కోరిక. ఆయన చాలా సార్లు తన మనసులోని కోరికని బయట పెట్టారు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరేనా? లేక ఇదేం కాదా? ఏది ఏమైనా ఈ నెల 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారట.

ఆ లుక్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో మూడు గెటప్స్‌లో కనిపించేది. ఆ మూడు గెటప్స్‌ ఏంటనేది తెలియజెప్పే విధంగా ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఒకవేళ అదే జరిగితే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి అంతకన్నా కావాల్సిందేముంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కళ్యాణ్‌ రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా థామస్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular