HomeMovie News Teluguపవన్‌ హీరోయిన్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌

పవన్‌ హీరోయిన్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌

పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ముద్దుగుమ్మలకు లక్‌ కలిసొస్తుందంటారు. అలా లక్‌ చిక్కిన ముద్దుగుమ్మల్లో శృతిహాసన్‌ది తొలి స్థానం. అంతవరకూ సో సోగా నడిచిన ఆమె కెరీర్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో టర్న్‌ అయిపోయింది. నెంబర్‌ వన్‌ సీటుకే లైనేసే రేంజ్‌కి చేరుకుంది. అలాగే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌ కళ్యాన్‌తో రొమాంటిక్‌ సాంగేసుకున్న ముద్దుగుమ్మ ప్రణీతకు కూడా కెరీర్‌ టర్స్‌ అవుతుందనీ అంతా భావించారు. బొంగరాల్లాంటి కళ్లతో, ఉంగరాల జుట్టుతో ఆ సినిమాలో బాగా ఎట్రాక్ట్‌ చేసింది కానీ ప్రణీత.

ఆ తర్వాత నుండీ ఆమె కెరీర్‌లో పెద్దగా వచ్చిన మార్పులేమీ కనిపించలేదు. కెరీర్‌ బెస్ట్‌ మూవీ అంటే పవన్‌తో నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా మాత్రమే ఆమె కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలచింది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఆలోచన మార్చుకుందట. అందరూ చేసేదే చేస్తే ఏం కిక్కుంటుంది. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా చేస్తేనే ఏదైనా కిక్కు. అనుకుందట. నిర్మాతగా మారాలనుకుంటోందట.

హీరోయిన్‌గా అవకాశాలు రాకపోయేసరికి ప్రణీత ఇలా ఆలోచన చేసిందట. అయితే కొత్త నటీనటులతో ప్రణీత ఓ సినిమాని నిర్మించాలనుకుంటోందట. తెలుగు సినిమా అంటేనే తనకెంతో ఇష్టమనీ, అందుకే తాను నిర్మించబోయే సినిమా తెలుగులోనే ఉండాలనీ ప్రణీత అభిప్రాయపడుతున్నట్లు ఆమె సన్నిహితుల నుండి అందిన సమాచారమ్‌. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular