HomeMovie News Teluguఅవంతిక వెర్సస్‌ దేవసేన

అవంతిక వెర్సస్‌ దేవసేన

‘బాహుబలి ది బిగినింగ్‌’ సినిమాలో అవంతికా రాజకుమారిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందంటూ ఆమె రాకుమారి గెటప్‌లో ఉన్న పోస్టర్‌ని విడుదల చేసి సినిమాపై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్‌ రాజమౌళి. అయితే సినిమాలో తమన్నా రాజకుమారిగా కాక ఉద్యమ నాయకురాలి పాత్రలో కనిపించింది మొదటి పార్ట్‌లో. రెండో పార్ట్‌లో ఆమె పాత్ర ఇక మొదటి పార్ట్‌లో ఉన్నంత కూడా ఉండదనీ, సెకండ్‌ పార్ట్‌ అంతా దేవసేన అనుష్కదేనని ప్రచారం సాగుతోంది.

అయితే సెకండ్‌ పార్ట్‌లో తన పాత్ర కూడా చాలా కీలకమైనదేననీ, అసలు క్లైమాక్స్‌ పార్ట్‌ తన పాత్రతోనే లింక్‌ అప్‌ అయ్యి ఉంటుందనీ మిల్కీ బ్యూటీ చెబుతోంది. ఫస్ట్‌ పార్ట్‌లోనే కత్తి యుద్ధాలు చేసి, శత్రువులను మట్టి కరిపించింది అవంతికగా మిల్కీ బ్యూటీ. ఇక రెండో పార్ట్‌లో యుద్ధ భూమిలో తన టాలెంట్‌ చూపిస్తానంటోంది. ఇప్పటికే ట్రైలర్‌ చూస్తుంటే.. ట్రైలర్‌లో అనుష్క పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లుగా అనిపిస్తోంది. విల్లు పట్టి, కత్తి పట్టి, ఒక్కటేమిటి వీరనారిలా కనిపిస్తోంది దేవసేన అనుష్క.

అయితే ట్రైలర్‌లో తన పాత్ర సీన్స్‌ ఎక్కువగా లేకపోవడంతో సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం లేదని భావించడం భావ్యం కాదంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తనకున్న పరిమితుల్లో తన పాత్రని చాలా బాగా బిల్డప్‌ చేశారు డైరెక్టర్‌ రాజమౌళి అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లోనే అసలు విషయం తేలిపోతుంది. కంగారేల వెయిట్‌ అండ్‌ సీ. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular