HomeMovie News Teluguబాహుబలి కోసం ఎదురు చూస్తున్నాయ్‌

బాహుబలి కోసం ఎదురు చూస్తున్నాయ్‌

ఇండియన్‌ ప్రెస్టీజియస్‌ మూవీ ‘బాహుబలి’ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌తోనే ఎన్నో రికార్డులు తెలుగు సినీ పరిశ్రమ సొంతం అయ్యాయి. ఇక రెండో పార్ట్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఉన్న హైప్‌కి ఆకాశమే హద్దయ్యింది. అందుకే ఈ సినిమా రిలీజ్‌ అవుతోందంటే జనం ఆశక్తిగా ఎదురు చూడడం కాదు.. రికార్డులే ఎదురు చూస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ టికెట్స్‌ హాట్‌ కేక్స్‌లా అమ్ముడైపోతున్నాయి.

24 గంటల్లో 10లక్షల టిక్కెట్లు అమ్ముడైపోయాయి. ఇదో ట్రాక్‌ రికార్డు ‘బాహుబలి’కి సంబంధించి. ఇక రేపు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని బట్టి ఫస్ట్‌ డే ఓపినింగ్స్‌ రికార్డులు కూడా ఈ సినిమావే. ఇక ఫస్ట్‌ వీకెండ్‌, ఫస్ట్‌ వీక్‌ రికార్డులు కూడా బాహుబలి సొంతమే. ఈజీగా ఈ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం ‘బాహుబలి’ సినిమా.

లాంగ్‌ రన్‌లో వెయ్యి కోట్ల మార్కెట్‌ని కొల్లగొట్టడం చాలా తేలిక ఈ సినిమాకి. అందుకే రికార్డులు ఎదురు చూస్తున్నాయి ‘బాహుబలి’ సినిమా కోసం అనే మాట చాలా చిన్నదైపోయింది. ప్రబాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రాజమౌళి సృష్టించిన అద్భుతం. తెలుగు సినీ చరిత్రని దేశ దేశాల చాటి చెప్పిన చిత్రమిది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular