HomeMovie News Teluguచరణ్‌ చాలా పెద్ద రిస్కే చేసేస్తున్నాడు

చరణ్‌ చాలా పెద్ద రిస్కే చేసేస్తున్నాడు

కథల్ని నమ్మినవాడెప్పుడూ చెడిపోడని సినీ పరిశ్రమలో ఓ బలమైన నమ్మకముంది. కమర్షియల్‌ సినిమాల్ని నమ్ముకున్నప్పుడే ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే కమర్షియల్‌ సినిమాలు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు సాధిస్తాయి. ఏమీ లేదనుకున్న ఓ సాధారణ కమర్షియల్‌ సినిమా సంచలన విజయం అందుకోవచ్చు. భారీ హంగులతో రూపొందే కమర్షియల్‌ సినిమా దారుణ పరాజయాన్ని చవిచూడొచ్చు. అయినప్పటికీ కూడా ప్రయోగాల బాట పట్టాలంటే కొంత టెన్షన్‌ ఏ హీరోకి అయినా సహజం.

అయితే కమర్షియల్‌ స్టామినా నిరూపించుకున్న హీరోలు అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయాలి తప్పదు. అదే చేస్తున్నాడు రామ్‌చరణ్‌. ‘ధృవ’ సినిమాతో పెద్ద ప్రయోగమే చేశాడు. అది రీమేక్‌ సినిమా అయినప్పటికీ అది చరణ్‌కి సాహసమే. ఆ సాహసంలో విజయవంతమయ్యాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇంకో ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అదే సుకుమార్‌ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా. ఇందులో చరణ్‌ గెటప్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా.

లుంగీ కట్టి, 1980 నాటి కాలంలో ఓ సాధారణ కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంతో కూడిన కథ అది. ఆ గెటప్‌ ఇప్పటితరానికి ఎక్కడం కష్టం. ఎక్కువగా మలయాళ సినిమాల్లో ఇలాంటి గెటప్స్‌, ఈ తరహా నేటివిటీ చూస్తుంటాం. దీని గురించి చిత్ర యూనిట్‌ ఏమంటోందంటే, కథ చాలా బలమైనదనీ సినిమా తప్పక విజయం సాధిస్తుందని. చరణ్‌ తన ఇమేజ్‌ని పక్కన పెట్టి చేస్తున్న చాలా పెద్ద రిస్క్‌ ఇది. కథే చరణ్‌ని గట్టెక్కించాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular