HomeMovie News Teluguఅన‌సూయ‌కు మ‌రో మెగా ఛాన్స్‌?

అన‌సూయ‌కు మ‌రో మెగా ఛాన్స్‌?

విన్న‌ర్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌క్క‌న ఆడిపాడింది అన‌సూయ‌. ఇప్పుడు ఆమెకు మ‌రో మెగా ఛాన్స్ ద‌క్కిన‌ట్టు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌. అయితే… ఈ టీమ్ లో ఇప్పుడు అన‌సూయ‌కు చోటు ద‌క్కిన‌ట్టు స‌మాచారం. అదేదో ప్ర‌త్యేక గీతం కోసం కాద‌ట‌. అన‌సూయ కోసం ఓ పాత్ర‌నే డిజైన్ చేశాడ‌ట సుకుమార్‌. ఈ సినిమాలో అన‌సూయ ప‌ల్లెటూరి ప‌డుచుగా క‌నిపించ‌బోతోంద‌ని, అన‌సూయ పాత్ర కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే నిజ‌మైతే అన‌సూయ మెగా అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైపోయిన‌ట్టే. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular