HomeMovie News Teluguబాహుబ‌లి 2... ఇదేం ట్విస్టు..??

బాహుబ‌లి 2… ఇదేం ట్విస్టు..??

బాహుబ‌లికి సంబంధించి ఏ చిన్న వార్త తెలిసినా సోష‌ల్ మీడియాలో అదే ట్రెండ్ అయిపోతోంది. ఇప్పుడు మ‌రో హాట్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. బాహుబ‌లిలో ఇప్పుడు మ‌రో కొత్త పాత్ర క‌నిపించ‌బోతోంద‌ట‌. అదే.. ధ‌ర్మేంద్ర బాహుబ‌లి. ఇప్ప‌టికే అమ‌రేంద్ర బాహుబ‌లి, మ‌హేంద్ర బాహుబ‌లి అనే రెండు పాత్ర‌ల్ని బాహుబ‌లిలో చూశాం. ఇది మూడో పాత్ర‌న్న‌మాట‌. బాహుబ‌లి అనే పేరు పెట్టి, ఆ పాత్ర‌లో మరెవ‌రినో చూపించ‌లేరు క‌దా?  అందులోనూ.. ప్ర‌భాసే క‌నిపించ‌డం ఖాయం.

సో.. ప్ర‌భాస్  త్రిపాత్రాభిన‌యం ఈ సినిమా ద్వారా చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. అయితే.. ఈ మూడు పాత్ర‌లూ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌వ‌ని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ధ‌ర్మేంద్ర బాహుబ‌లి పాత్ర వ‌స్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.  ఆ పాత్ర ఎంత సేపున్నా… బాహుబ‌లిలో మూడో ప్ర‌భాస్‌కూడా ఉన్నాడ‌న్న విష‌యం హాట్ టాపిక్కేగా!

You May Like This
- Advertisment -spot_img

Most Popular