HomeMovie News Teluguనాని 'మెగా' కోరిక తీరుతుందా!

నాని ‘మెగా’ కోరిక తీరుతుందా!

మీకు తెలుసా? చిరంజీవి సినిమా చూడ్డం కోసం యంగ్‌ హీరో నాని తనకెంతో ఇష్టమైన సైకిల్‌ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడో జరిగిందిది. స్వయంగా చిరంజీవితో ఈ విషయాన్ని నాని పంచుకున్నాడు. ‘పెద్దయ్యాక నువ్వేమవుతావు?’ అని నానిని అతని తల్లిదండ్రులు చిన్నప్పుడు ప్రశ్నిస్తే, ‘చిరంజీవినవుతా’ అని చెప్పేవాట. అలా ఇంట్లో, నానిని చిరంజీవి అని కూడా పిలిచేవారట. ‘మాస్టర్‌’ సినిమా కోసం సగటు అభిమానిలా థియేటర్‌కి వెళ్ళి, టిక్కెట్‌ సంపాదించిన ఆనందంలో బయట లాక్‌ వేయకుండా సైకిల్‌ మర్చిపోతే, సినిమా పూర్తయ్యాక సైకిల్‌ టెన్షన్‌ వచ్చినా, ఇంటికెళ్ళి మేనేజ్‌ చేసేశాడట.

‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా టైమ్‌లో నిర్మాత అల్లు అరవింద్‌కీ తన సైకిల్‌ కథ గురించి నాని చెబితే, ‘ఆ సైకిల్‌ నేను కొనిస్తాను’ అని ఆయన చెప్పారట. అయితే ఆ సైకిల్‌ అల్లు అరవింద్‌ నుంచి నానికి దక్కలేదట. అందుకే డైరెక్ట్‌గా మెగాస్టార్‌ని నాని అడిగేయడంతో, నా అభిమానికి నేను ఆ మాత్రం చేయలేనా? అని చెబుతూ, ‘నీకు సైకిల్‌ కొనిచ్చే బాధ్యత నాది’ అని చిరంజీవి హామీ ఇచ్చారట.

చిరంజీవి హామీ ఇస్తే ఇంకేముంది, నానికి సైకిల్‌ వచ్చేసినట్లే. కానీ యంగ్‌ హీరోగా మంచి స్టార్‌డమ్‌ సంపాదించుకున్న నానికి ఆనాటి సైకిల్‌ ఇప్పుడు కొనుక్కోవడం పెద్ద లెక్కా? అయినాగానీ అది మెగాస్టార్‌ కోసం కోల్పోయిన బైక్‌. మెగాస్టార్‌ నుంచి అందితే ఆ కిక్కే వేరప్పా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular