HomeMovie News Teluguపండ‌గ పూట కూడా.. ఏంటిది మ‌హేష్‌..??

పండ‌గ పూట కూడా.. ఏంటిది మ‌హేష్‌..??

టాలీవుడ్‌లో ప్ర‌చారం కొత్త పుంత‌లు తొక్కుతోంది. వీలైన‌ప్పుడ‌ల్లా ఓ స్టిల్లో, టీజ‌రో రిలీజ్ చేయ‌డానికి రెడీ అంటున్నారు స్టార్లూ, డైరెక్ట‌ర్లు. పుట్టిన రోజుకో టీజ‌ర్‌, పండ‌గ‌కో ట్రైల‌ర్ అంటూ.. హ‌డావుడి చేస్తున్నారు. కానీ మ‌హేష్ బాబు మాత్రం ఎప్ప‌టి లానే హ్యాండిస్తూ వ‌స్తున్నాడు. మ‌హేష్ బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప‌ట్టాలెక్కి ఆరు నెల‌లైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క స్టిల్ కూడా బ‌య‌ట‌కు రాలేదు.

ఫ‌స్ట్ లుక్ కూడా లేకుండా ఇంత‌కాలం సెట్స్‌పై ఉన్న సినిమా ఇదొక్క‌టేనేమో. ఉగాది రోజున ఫ‌స్ట్ లుక్ వ‌స్తుంద‌ని, టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తార‌ని అభిమానులు ఆశ‌లు పెట్టుకొన్నారు. అయితే ఉగాది రోజు కూడా మ‌హేష్ హ్యాండిచ్చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్సేం బ‌య‌ట‌కు రాలేదు. టైటిల్ విష‌యంలో చిత్ర‌బృందం ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని, అందుకే లుక్స్ ఏమీ విడుద‌ల చేయ‌ట్లేద‌ని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ నీర‌స‌ప‌డిపోయారు. వాళ్ల‌లో జోష్ రావాలంటే… మ‌హేష్ నుంచి ఏదైనా స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ రావాల్సిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular