HomeMovie News Teluguఅంజ‌లి కి పెళ్ల‌ట‌...నిజ‌మేనా?

అంజ‌లి కి పెళ్ల‌ట‌…నిజ‌మేనా?

రాజోలు పాప‌, తెలుగింటి గీతాంజ‌లి… త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోందా?  అవున‌నే అంటున్నాయి చెన్నై వ‌ర్గాలు. అంజ‌లి గ‌త కొంత కాలంగా పెళ్లి విష‌య‌మై సీరియ‌స్‌గా ఆలోచిస్తోంద‌ట‌. ఇప్పుడు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే అంజ‌లి పెళ్లి కూతురిగా క‌నిపించ‌డం ఖాయ‌మంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. అంజ‌లి యేడాది కాలంగా త‌మిళ హీరో జైతో డేటింగ్ చేస్తోంద‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రూ క్లోజ్‌గా ఉంటున్న ఫొటోలు కొన్ని బ‌య‌ట‌కు కూడా వ‌చ్చాయి.

సూర్య `దోశ ఛాలెంజ్‌`లో అంజ‌లి కోసం జై ప్రేమ‌గా దోసె వేసి ఇచ్చాడు. అప్ప‌టి నుంచీ.. ఆ పుకారు మ‌రింత బ‌లంగా వినిపిస్తోంది. అంజ‌లి తెలుగులో సినిమాలేం  చేయ‌డం లేదు. త‌మిళంలోనూ పెద్ద‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. ఎలాగూ ఖాళీ దొరికింది క‌దా. అందుకే పెళ్లి చేసుకొంటే ఓ పనైపోతుంద‌నుకొంటోందేమో. అంజ‌లి పెళ్లి విష‌య‌మై ఇది వ‌ర‌కూ చాలానే వార్త‌లొచ్చాయి. కానీ అంజ‌లి వాటిని లైట్ తీసుకొంది. మ‌రి ఇప్పుడేమంటుందో?

You May Like This
- Advertisment -spot_img

Most Popular