HomeMovie News Teluguతాప్సీ ప్రేమలో పడింది!

తాప్సీ ప్రేమలో పడింది!

అందాల భామ తాప్సీ ప్రేమలో పడిందట. అయితే లవర్‌ ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. తన తాజా చిత్రం ‘నామ్‌ షబానా’ ప్రమోషన్‌ కోసం ఇంటర్వ్యూలు ఇస్తోన్న తాప్సీ, ఓ ఇంటర్వ్యూలో కాబోయే భర్త గురించి చెబుతూ, ప్రేమ విషయాల్ని వెల్లడించింది. ‘ఆ వ్యక్తి విషయంలో చాలా గర్వపడుతున్నా. నేను అతని ప్రేమలో ఉన్నాను. అతనెవరో మాత్రం చెప్పను’ అని తాప్సీ అనడంతో ఆ వ్యక్తి ఎవరన్న సస్పెన్స్‌ పెరిగింది. అయితే ఆ వ్యక్తి మథియాస్‌ బో అని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

ఇండియా సూపర్‌ సిరీస్‌ కోసం మథియాస్‌ ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు. ఢిల్లీలోనే అతను ఉండడంతో తరచూ ఈ ఇద్దరూ కలుసుకుంటున్నారని సమాచారమ్‌. అయితే తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలను అస్సలు అంగీకరించబోనని అంటోంది. తాను చెప్పే వరకు ఊహాగానాలకు ఎవరూ ఆస్కారం ఇవ్వరాదని విజ్ఞప్తి చేస్తోంది తాప్సీ. తాప్సీ భలే తెలివైనదే. వివరాలన్నీ చెప్పినట్లే చెప్పి, కొంచెం గోప్యం పాటిస్తోంది.

బాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అలాగే చాలా బిజీగా కూడా మారిపోయింది. తాప్సీ తాజా సినిమా ‘నామ్‌ షబానా’ హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలవుతోంది. తెలుగులో ‘నేనే షబానా’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రమోషన్‌ కూడా బాగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాతో తాప్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular