HomeMovie News Teluguఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన ప్రభాస్..

ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే ప్రతి చిన్న అప్‌డేట్ కూడా అభిమానుల్లో భారీ చర్చకు దారితీస్తుంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓ చిన్న మార్పు ఇప్పుడు వైరల్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు ఏడేళ్ల తర్వాత డిస్‌ప్లే పిక్చర్ (డీపీ)ని మార్చడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పటి నుంచి ‘బాహుబలి’ సినిమాలోని తన ఫోటోనే డీపీగా ఉంచారు. మధ్యలో ఎన్నో సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, అప్డేట్లు షేర్ చేసినప్పటికీ డీపీ మాత్రం మార్చలేదు. అయితే ఇప్పుడు ఆ ఐకానిక్ ‘బాహుబలి’ ఫోటోకు బదులుగా తన తాజా చిత్రం ‘ఫౌజీ’లోని ఓ పవర్‌ఫుల్ స్టిల్‌ను డీపీగా పెట్టారు.

ఈ మార్పు కనిపించగానే అభిమానులు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేశారు. కొద్ది సేపటికే #PrabhasDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వెళ్లింది. కొత్త డీపీలో ప్రభాస్ లుక్ చాలా స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా ఉండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరోవైపు, ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌కు ఇది సంకేతమా? అనే చర్చ కూడా నెట్టింట జోరుగా సాగుతోంది. డీపీ మార్పుతోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘డార్లింగ్ నుంచి ఇది చిన్న అప్‌డేట్ కాదు.. ‘ఫౌజీ’ హంగామా మొదలైంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కొత్త డీపీ సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతూ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular