మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను అప్పుడప్పుడు ముందే లీక్ చేస్తూ దర్శకులకు, అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా మరోసారి తన కొత్త సినిమా టైటిల్‌ను అనుకోకుండా లీక్ చేసినట్లు తెలుస్తోంది.
చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘Mega 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. తాజాగా ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు తమన్‌తో చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన కొత్త సినిమా పేరు ‘కదిరి’ అని చెప్పడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తాను సినిమా గురించి మాట్లాడే క్రమంలో అనుకోకుండా టైటిల్‌ను వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ మరోసారి టైటిల్ లీక్ చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 22న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవి చెప్పిన ‘కదిరి’నే సినిమా టైటిలా? అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రియమణి, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు.





