HomeMovie News Teluguదాంతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ

దాంతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ

ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘RAW NTR’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థకు తమతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ప్రకటనలు చేయడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి లేదా అధికారిక ప్రకటనలు విడుదల చేయడానికి ఆ సంస్థకు ఎలాంటి అనుమతి లేదా అధికారం లేదని వెల్లడించింది.

ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేదా ఇతర అధికారిక సమాచారం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే విడుదల అవుతుందని పేర్కొంది. ఈ అంశంపై ఇదే తమ తుది వివరణ అని కూడా స్పష్టం చేసింది.

అలాగే మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వర్గాలు, అభిమానులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేసింది.

ఇటీవల ఎన్టీఆర్ ఈ నెల 18న రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో, పలు మీడియా వేదికల్లో విస్తృతంగా జరిగింది. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రచారానికి చెక్ పెట్టేందుకు, వాస్తవ పరిస్థితిని స్పష్టం చేయడానికి ఎన్టీఆర్ కార్యాలయం ఈ అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular