HomeMovie News Teluguఅఖిల్ లెనిన్ కు అదిరిపోయే ఓపెనింగ్..

అఖిల్ లెనిన్ కు అదిరిపోయే ఓపెనింగ్..

అక్కినేని అఖిల్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయానికి ‘లెనిన్’ రూపంలో మంచి ఆరంభం లభించినట్లు కనిపిస్తోంది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

విడుదలకు ముందు నుంచే చిత్రబృందం సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఆ అంచనాల మధ్య విడుదలైన ‘లెనిన్’ కు తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.

మేకర్స్ విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం, ‘లెనిన్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. రెండో రోజు కూడా పలు ప్రాంతాల్లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ స్పందన కొనసాగితే అఖిల్ కెరీర్‌లో ఇది ఒక కీలక విజయంగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular