గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై మంచి హైప్‌ను తీసుకువచ్చాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రామ్ చరణ్ రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు.
పోస్టర్‌లో ఆయన వెనుక మంచం మోసుకుంటూ, ఒక చేతిలో ట్రంక్ పెట్టె, మరో చేతిలో విఐపీ అని రాసి ఉన్న కవర్ పట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతున్న విజువల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, సాయి కుమార్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు. మే 18న రాబోయే ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మొత్తానికి, పెద్ది ప్రమోషన్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లోకి వెళ్లిపోయాయి.
#PEDDI will stay in your hearts❤️
— PEDDI (@PeddiMovieOffl) May 11, 2026
TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd pic.twitter.com/8wIgUTgGrz





