HomeMovie News Teluguప్రభాస్ స్పిరిట్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ..

ప్రభాస్ స్పిరిట్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో స్పిరిట్ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, ఇటీవల సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదాపై పలు వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న SVC63 చిత్రం 2027 మార్చి 5న ఈద్ కానుకగా విడుదల కానుందని ప్రకటించడంతో, అదే తేదీకి రావాల్సిన స్పిరిట్ వెనక్కి వెళ్లొచ్చనే ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై తాజాగా ప్రభాస్ పీఆర్ఓ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘స్పిరిట్ చిత్రం షూటింగ్ అనుకున్న ప్రణాళిక ప్రకారమే శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఎలాంటి వాయిదా లేదు’ అంటూ అధికారిక పోస్టర్‌ను షేర్ చేశారు.

ఈ అప్డేట్ బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా స్టైల్ యాక్షన్, ప్రభాస్ మాస్ ఇమేజ్ కలవడంతో స్పిరిట్ పై హైప్ మరింత పెరిగింది.

మొత్తానికి, రిలీజ్ వాయిదాపై వస్తున్న వార్తలకు మేకర్స్ అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular