టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. ముఖ్యంగా సంగీత దర్శకుల ఎంపిక విషయంలో కూడా ఆయన తరచూ మార్పులు చేస్తుంటారు.
కెరీర్ ప్రారంభంలో సాయి కార్తీక్‌తో కలిసి పనిచేసిన అనిల్ రావిపూడి.. తర్వాత పలు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. ఇక ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో పాటు, పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో అనిల్ తదుపరి సినిమాకి కూడా భీమ్స్‌నే కొనసాగిస్తారని చాలామంది భావించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి తన కొత్త ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చినట్లు టాక్ వినిపిస్తోంది.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇప్పటికే అనిల్ రావిపూడి – జీవీ ప్రకాష్ మధ్య చర్చలు జరిగాయని, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది.
త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.





