HomeTeluguజెట్లీ మూవీ రివ్యూ & రేటింగ్

జెట్లీ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: జెట్లీ
దర్శకత్వం: రితేష్ రానా
కథ – రచన: రితేష్ రానా, జయేంద్ర ఎరోలా

నటీనటులు: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, కబీర్ దుహాన్ సింగ్, గుండు సుదర్శన్, తదితరులు

నిర్మాతలు: హేమలత పెద్ధమల్లు, చిరంజీవి

సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్మెంట్

విడుదల తేదీ: 01 మే 2026

సత్య కమెడియన్ గా నటిస్తూనే అప్పుడప్పుడు హీరోగా కూడా మెరుస్తున్నాడు. ‘మత్తు వదలరా’ సిరీస్ లతో సూపర్ హిట్స్ కొట్టిన సత్య మళ్ళీ అదే దర్శకుడితో ‘జెట్లీ’ సినిమాతో ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చాడు. పెద్ద సినిమాలు లేకపోవటంతో ఈ వారం సత్య సందడి గట్టిగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. పైగా ఈ సినిమాలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా నటించటం విశేషం. సత్య హీరోగా హిట్ కొట్టాడా ? జెట్లీ చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టనుందా? సత్య ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాడు అన్నది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ప్రజాపతి (అజయ్) బిజినెస్ మ్యాన్. తన పేరుతో బ్యాంకు రన్ చేస్తూ ఉంటాడు. సడెన్ గా తన బ్యాంక్ దివాళా తీసింది అని చెప్పి 15 వేల కోట్లతో దుబాయ్ పారిపోతాడు. అంతే కాదు అదే బ్యాంకుకి చెందిన ఇంకో హెడ్ హరిచంద్ర ప్రసాద్(శుభలేఖ సుధాకర్) ని చంపేస్తాడు. ఈ విషయం బయట పడటంతో ప్రజాపతి బ్యాంక్ ఖాతా దారులంతా తమ డబ్బు కోసం ధర్నాకు దిగుతారు. హోమ్ మినిస్టర్ కూడా ప్రజాపతిని పట్టుకోవాలని ఆర్డర్డ్స్ పాస్ చేస్తాడు. ఇంకో వైపు దుబాయ్ లో ఉన్న ప్రజాపతిని చంపడానికి కొందరు ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాపతి లొంగిపోతానని ఇండియాకి తిరిగి రావడానికి ఏజెంట్ శివాని రాయి(రియా సింగ్) టీం సపోర్ట్ తీసుకుని ఇండియాకి వస్తుంటాడు. ఇండియాకి వస్తూ దారి మధ్యలో తపించుకోవాలన్నది ప్రజాపతి ప్లాన్. ఫ్లైట్లో కూడా ప్రజాపతిని చంపడానికి కొందరుట్రై చేస్తూ ఉంటారు. ఇదే ఫ్లయిట్ లో డాక్టర్ వేదవ్యాస్( సత్య ) కూడా ఉంటాడు. వేదవ్యాస్ కి తాను ఎవరో గుర్తు ఉండదు. ఎవరో ఒకరు చెప్తూ ఉంటె తనని తాను గుర్తుకు తెచుకుంటాడు. బిజినెస్ టైకూన్ వ్యాపారంలో ఎలా మోసపోయాడు ? డాక్టర్ వేద వ్యాస్ పాత్ర ఏంటి ? ప్రజాపతి తో వ్యాస్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? ప్రజాపతి ఇండియన్ ఏజెంట్స్ నుంచి తప్పించుకోగలిగాడా ? అసలు ప్రజాపతిని ఎందుకు చంపా లనుకుంటున్నారు? అసలు ఫ్లయిట్ లో ఉన్నవాళ్ళంతా ఎవరు? ప్రజల సొమ్ము రికవరీ అయ్యిందా? లేదా? కథలో వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సత్య, డైరెక్టర్ రితేష్ రానా కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. మత్తు వదలరా పార్ట్ 1, 2 సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సత్య కామెడీ టైమింగ్ తో ఆ కథలకి మంచి హైపు వచ్చింది. ఈ కారణంగానే జెట్లీ సినిమాపై కూడా అంచనాలను నెలకొన్నాయి. ఫస్ట్ అఫ్ ప్రజాపతి పాత్ర పరిచయం, బ్యాంక్ మోసం, దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి రావడం, ఫ్లైట్లో ఉండడం, ఫ్లైట్ లో ఉన్న జనాలు, వాళ్ల పాత్రల గురించి చూపిస్తారు. సత్య గజిని తరహా క్యారక్టర్లో అలరిస్తాడు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా, సాగదీతగా అనిపిస్తుంది. కేవలం కామెడీ సీన్స్ , స్పూఫ్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ నడిపించారు. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. అసలు బ్యాంకు స్కామ్ ఏంటి? సత్య కి ఈ కథతో సంబంధం ఏంటి ? వెన్నెల కిషోర్ పాత్ర? అన్నీ సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో కథతో పాటు కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది. జెట్లీ లో కథకి స్కోప్ లేదు. కేవలం సత్య , వెన్నెల కిషోర్ ల కామెడీ టైమింగ్ ని నమ్ముకుని దర్శకుడు రెండు గంటల సినిమా నడిపించాడు. మత్తు వదలరా సినిమా కామెడీ అంత జెట్లీ కామెడీ పండలేదు. అక్కడక్కడా అతిగా అనిపిస్తుంది. ఆరవ సినిమా కామెడీని తలపిస్తుంది.

సినిమా మొత్తం ఫ్లైట్ లోనే జరగడంతో కొంచెం బోర్ కొడుతుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తిగా లేదు. కంప్లీట్ గా లాజిక్స్ మిస్ అయ్యాయి. లాజిక్స్ లేకుండా కామెడీ కోసమే అన్నట్టు ఉంది సినిమా మొత్తం. సత్య నుంచి కామెడీ ఆశించి వెళ్లే ప్రేక్షడికి నిరాశ ఎదురవదు. హాలీవుడ్ స్టైల్ లో యాక్షన్ కామెడీ అని స్పూఫ్ కామెడీ తో సరిపెట్టారు. కొంతలో కొంత ఎంటర్టైన్ మెంట్ అంటే సత్య, వెన్నల కిషోర్ హావ భావాలు , కామెడీ అని చెప్పొచ్చు. టైటిల్ కి కథకి సంబంధం ఏంటో మనమే వెతుక్కొని జస్టిఫై చేసుకోవాలి. ఒక్క పాయింట్ పెట్టి స్పూఫ్ కామెడీ, పంచ్ డైలాగ్స్ తో రెండు గంటలు ప్రేక్షుకుడిని ఎంగేజ్ చేయాలనుకొవటం సాహసం అని చెప్పాలి.

నటీ నటులు:

సత్య తన స్టైల్‌లో కడుపుబ్బా నవ్వించాడు. సత్య కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసాడు. వెన్నెల కిషోర్ కనిపించిన ప్రతి సీన్ ఫుల్ గా నవ్వించాడు. అజయ్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తన పాత్ర పరిధి మేరకు చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్ రియా సింఘా స్క్రీన్ ప్రజెన్సీ బాగుంది. తన పాత్రప్రాధాన్యతకి తగ్గట్టు నటించి ఆకట్టుకుంది. గుండు సుదర్శన్, వైవాహర్ష బాగానే నవ్వించారు. వడ్లమాని శ్రీనివాస్, శుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్, మిగిలినవారు తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

టెక్నికల్:

దర్శకుడు రితేష్ రానా తనకి కలిసి వచ్చిన కామెడీ జోనర్ తో మరొక ప్రయత్నం చేసి విఫలం అయ్యాడనే చెప్పొచ్చు. ఇది వరకు వర్క్ చేసిన సత్య, వెన్నెల కిషోర్ లతో కలిసి కామెడీ పండించటానికి దాదాపుగా ప్రయత్నం చేసాడని చెప్పొచ్చు. కానీ మత్తు వదలరా మూవీ లాంటి హిట్ కొట్టలేకపోయాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా మొత్తం ఫ్లైట్లో జరిగేలా చూపించటం మామూలు విషయం కాదు. ఈ విషయం లో ఆర్ట్ డిపార్ట్మెంట్ హార్డ్ వర్క్ ని గుర్తించాలి. ఫ్లైట్ సెట్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. కాలభైరవ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలకి పెద్దగా స్కోప్ లేదు, ఉన్నవి కూడా అంతగా క్లిక్ అవలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

సత్య, వెన్నెల కిషోర్
కామెడీ
ఆర్ట్ డిపార్ట్మెంట్

మైనస్ పాయింట్స్

లాజిక్స్ మిస్
సాగదీత సీన్స్

You May Like This
- Advertisment -spot_img

Most Popular