HomeMovie News Teluguచరణ్ - సుకుమార్ మూవీపై సూపర్ అప్‌డేట్

చరణ్ – సుకుమార్ మూవీపై సూపర్ అప్‌డేట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘RC 17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటికే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట షూటింగ్ కొనసాగుతోంది. మరో ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇక చరణ్ – సుకుమార్ కాంబో మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆ సంస్థ సీఈవో చెర్రీ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జూన్ నెల నుంచి ఈ సినిమాకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు.

‘పెద్ది’ షూటింగ్ పూర్తయ్యాక రామ్ చరణ్ నేరుగా సుకుమార్ ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నాడు. ఇదే సమయంలో ‘పెద్ది’ సినిమాను కూడా జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మొత్తానికి, ఈ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించబోతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular