HomeMovie News Teluguహీరోల డ్రగ్స్ టెస్ట్ డిమాండ్.. మంచు విష్ణు కౌంటర్

హీరోల డ్రగ్స్ టెస్ట్ డిమాండ్.. మంచు విష్ణు కౌంటర్

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. సినిమాల విడుదలకు ముందు హీరోలు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని, నెగటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే సినిమాలు విడుదల చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఈ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవచ్చు. అయితే ఎన్నికల ముందు పోటీ చేసే ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి టెస్టులు చేయించుకోవాలా? అంటూ ఆయన ప్రశ్నించారు.

సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా పారదర్శకంగా ఉండాలని, కేవలం సినిమా రంగాన్ని మాత్రమే టార్గెట్ చేయడం సరైంది కాదని విష్ణు పరోక్షంగా పేర్కొన్నారు.

ఇటీవల టాలీవుడ్‌ను డ్రగ్స్ అంశం చుట్టుముట్టిన నేపథ్యంలో, ఓ ఎమ్మెల్యే ఈ విషయాన్ని సినిమా విడుదలతో ముడిపెట్టడం మరింత చర్చనీయాంశమైంది. దీనికి మంచు విష్ణు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సినీ పరిశ్రమకు మద్దతుగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో కూడా చర్చకు దారితీస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular