HomeMovie News Teluguబైకర్ ప్రమోషన్స్‌లో ప్రభాస్..

బైకర్ ప్రమోషన్స్‌లో ప్రభాస్..

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ నటించిన బైకర్ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగడం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.

ప్రభాస్ ఒక స్పెషల్ వీడియో ద్వారా మాట్లాడుతూ.. ట్రైలర్ చూసి కొన్ని విషయాలు నమ్మేయాలి డ్యూడ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ తనకు ఫ్యామిలీ హీరో అని చెప్పిన ఆయన, ఏప్రిల్ 3న విడుదల కానున్న బైకర్ ను అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలని అభిమానులను కోరారు.

ప్రభాస్ ప్రమోషన్స్‌లో భాగం కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళనాడులో థింక్ స్టూడియోస్ విడుదల చేస్తోంది.

ఇక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ బుల్లెట్ సునీల్ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన మాజీ మోటోక్రాస్ రేసర్‌గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. కథలో ఆయన పాత్రకు 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్ గెలిచిన బ్యాక్‌స్టోరీని చూపించడం ఆసక్తిని పెంచుతోంది.

శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మొత్తానికి ప్రభాస్ ఎంట్రీతో బైకర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విడుదల రోజున ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular