భారతీయ ప్రేక్షకులు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ జానర్లో ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అయితే, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
అలాంటి చిత్రాల్లో లగాన్ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయ గ్రామ ప్రజలు మరియు బ్రిటిష్ అధికారుల మధ్య జరిగే మ్యాచ్ కథాంశంగా ఉంటుంది. విడుదలైన సమయంలో ఈ సినిమా భారీ సంచలనం సృష్టించింది.
అలాగే కుస్తీ నేపథ్యంలో వచ్చిన దంగల్ చిత్రం కూడా భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ దర్శకుడు బుచ్చిబాబు సనా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి పెద్ది అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కూడా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం విశేషం.
ఈ సినిమాలో ఒకే క్రీడ కాకుండా, పలు క్రీడలను చూపించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, వీడియోల ప్రకారం ఇందులో క్రికెట్, కుస్తీ వంటి అంశాలు ఉండనున్నాయి. ఇంకా మరికొన్ని క్రీడలు కూడా సినిమాలో భాగమవుతాయని టాక్.
తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా, భారతీయ సినిమాల్లో కూడా ఒకేసారి పలు క్రీడలను కలిపి తెరకెక్కించే ప్రయత్నాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో పెద్ది పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషన్ బలంగా వర్కౌట్ అయితే, పెద్ది కూడా లగాన్, దంగల్ తరహాలో భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.





