HomeMovie News Teluguఉగాదికే ‘ఉస్తాద్’ ఊచకోత.. రిలీజ్ ముందుకు!

ఉగాదికే ‘ఉస్తాద్’ ఊచకోత.. రిలీజ్ ముందుకు!

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది.

మొదట ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. “ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

రిలీజ్ తేదీ ముందుకు రావడంతో పవర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగకు ముందే థియేటర్ల వద్ద భారీ సంబరాలు ఉండనున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular