టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక సింపుల్‌గా కానీ గ్రాండ్‌గా నిర్వహించబడింది.
తాజాగా రష్మిక తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగమైన పోస్టు చేస్తూ తన భర్త విజయ్ దేవరకొండను అభిమానులకు అధికారికంగా పరిచయం చేశారు.
Vijay Deverakonda and Rashmika Mandanna’s Wedding Photos
“నన్ను ప్రేమించే అందరికీ హాయ్… నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నాను. నిజమైన ప్రేమ అంటే ఏమిటో నాకు చూపించిన వ్యక్తి విజయ్. నేను స్వేచ్ఛగా జీవించిన ప్రతి క్షణంలోనూ, నా నిర్ణయాల్లోనూ ఆయన నాకు అండగా నిలిచారు. ఆయన వ్యక్తిత్వం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. నా కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండి నా జీవితానికి కొత్త అర్థం ఇచ్చారు. ఇకపై విజయ్ భార్యగా పిలిపించుకోవడం నాకు గర్వంగా ఉంది. మా భవిష్యత్తు ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ రష్మిక తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు మరియు సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram





