HomeMovie News Teluguవిజయ్ - రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు!

విజయ్ – రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావడంతో మరికొన్ని గంటల్లో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది.

ఈ నేపథ్యంలో విజయ్–రష్మిక జంటకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ జంటకు ఆశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సందేశం పంపారు. ఈ మేరకు విడుదలైన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మోదీ తన సందేశంలో “విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల జీవితంలో ఇది కొత్త అధ్యాయానికి నాంది. ‘సప్తపది’ అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు వేసి జీవితాంతం స్నేహితులుగా, తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. అలాగే ఈ ఇద్దరి కుటుంబాలకు కూడా అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం ఈ సందేశం అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతోంది. సోషల్ మీడియాలో విజయ్–రష్మిక జంటకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular