HomeMovie News Teluguరవితేజ 'RT-77'లో స్టార్ హీరోయిన్.. ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా?

రవితేజ ‘RT-77’లో స్టార్ హీరోయిన్.. ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా?

వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, ఇటీవల కాలంలో రవితేజకు పెద్ద హిట్ మాత్రం దక్కలేదు. ఇటీవల విడుదలైన ‘మాస్ జాతర’ కూడా భారీ అంచనాలున్నా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ వేగంగా సాగుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఈ ప్రాజెక్ట్‌తో పాటు రవితేజ మరో కొత్త సినిమా ‘RT-77’ కు కమిట్ అయ్యాడు. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్నట్లు సమాచారం. షూటింగ్ వచ్చే నెల ప్రారంభమవుతుందని, సంగీతం అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఈ చిత్రంతో రవితేజ సరసన నటించబోతున్నారని టాక్. ‘RT-77’తో సామ్ తన రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో రవితేజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చాలా రోజుల తర్వాత సమంత బిగ్‌స్క్రీన్‌పై కనిపించబోతుండటం, ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్న అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే రవితేజకు ఇటీవల వరుసగా వచ్చిన ఫ్లాప్స్ దృష్ట్యా, ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా? అన్న ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సమంత ఉండటం వల్ల ఈ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular