HomeMovie News TeluguI-Bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. సినీ ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్!

I-Bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. సినీ ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్!

తెలుగులో పైరసీకి పర్యాయపదంగా మారిన ఐ-బొమ్మ (I-Bomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు (CCS Police) పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం, రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే అరెస్ట్ అయ్యాడు.

ఇన్నేళ్లుగా రవి కరేబియన్ దీవుల్లో ఉండి ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రన్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సైట్ ద్వారా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లు – నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా వంటి వాటిలోని సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిమిషాల వ్యవధిలోనే పైరసీ చేసి అప్‌లోడ్ చేస్తున్నట్లు తేలింది.

ఇటీవల ఐ-బొమ్మ ఆగడాలు మరీ పెరిగిపోయాయి. థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు కూడా గంటల వ్యవధిలోనే పైరసీ అవుతుండడంతో తెలుగు నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు సీసీఎస్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

అయితే అప్పట్లో ఈ ఫిర్యాదు మీద ఐ-బొమ్మ నిర్వాహకుడు స్వయంగా స్పందిస్తూ..

“మాపై దృష్టి పెడితే మేమూ మీపై ఫోకస్ చేస్తాం. ఇండియా మొత్తం మా వెంటే ఉంది. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి,” అని సోషల్ మీడియాలో పోలీసులకు సవాల్ విసిరాడు.

ఈ సవాల్‌కి ప్రతిస్పందనగా అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటిస్తూ..

“ఐ-బొమ్మ నిర్వాహకుడిని తప్పకుండా అరెస్ట్ చేస్తాం,” అని నిర్మాతలకు హామీ ఇచ్చారు.

తాజాగా ఆ హామీకి అనుగుణంగా ఇమ్మడి రవి అరెస్ట్ కావడంతో తెలుగు సినీ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో సినిమా రంగంలో పైరసీపై పెద్ద దెబ్బ పడిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular