HomeMovie News Teluguపండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. స్పెషల్ పర్సన్ అంటూ హ్యాపీ పోస్టు!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. స్పెషల్ పర్సన్ అంటూ హ్యాపీ పోస్టు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ (Katrina Kaif), నటుడు విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) దంపతులు జీవితంలో అతి పెద్ద ఆనందకర వార్తను పంచుకున్నారు. ఈ స్టార్‌ జంట తల్లిదండ్రులయ్యారు. నవంబర్‌ 7న కత్రినా కైఫ్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పంచుకున్న కత్రినా-విక్కీ దంపతులు, “మా జీవితంలో ఆనందం రెట్టింపు అయింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతలతో మా స్పెషల్ పర్సన్‌ను – మా బాబును స్వాగతిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి” అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌తో సోషల్ మీడియా అంతా హర్షాతిరేకంగా మారింది. అభిమానులు, సినీ సెలబ్రిటీలు, స్నేహితులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా-విక్కీ జంట 2021లో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వయసులో విక్కీ చిన్నవాడైనా, ప్రేమకు వయసు అడ్డుకాదని నిరూపిస్తూ ఈ జంట ఏడడుగులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇటీవలే కత్రినా ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. నాలుగేళ్ల వివాహజీవితం తర్వాత తమ బిడ్డ పుట్టడంతో ఈ జంట ఆనందంలో మునిగిపోయారు.

సినిమాల విషయానికొస్తే – కత్రినా కైఫ్‌ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటే, విక్కీ కౌశల్‌ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘ఛావా’ సినిమాతో సక్సెస్‌ అందుకున్న ఆయన, ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తూ మరోసారి మ్యాజిక్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular