HomeTeluguతెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే!

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే!

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు (TSBIE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. బోర్డు ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఈ వివరాలను మీడియా సమావేశంలో ప్రకటించారు. అలాగే ఈ ఏడాది సిలబస్‌ మార్పులు, ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ గురించి కూడా వివరించారు.

సిలబస్‌లో కీలక మార్పులు
ఇప్పటి వరకు ప్రాక్టికల్‌ ల్యాబ్స్‌ సెకండ్‌ ఇయర్‌లో మాత్రమే ఉండేవి. కానీ ఈ ఏడాది నుంచీ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు కూడా ల్యాబ్‌ సెషన్లు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఉండనున్నాయి. అలాగే 12 ఏళ్ల తర్వాత ఇంటర్‌ సిలబస్‌లో ప్రధాన మార్పులు జరుగుతున్నాయని బోర్డు తెలిపింది. ముఖ్యంగా మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జూలజీ సబ్జెక్ట్‌లలో కొత్త చాప్టర్లు, పునర్వ్యవస్థీకరణ జరగనుంది.

పరీక్షల తేదీలు

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు: ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు: ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం

ప్రాక్టికల్‌ పరీక్షలు:
థియరీ పరీక్షలకు ముందుగానే, ప్రాక్టికల్స్‌ జనవరి చివరి వారంలో ప్రారంభమై ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular