HomeMovie News Teluguప్రభాస్‌ ‘స్పిరిట్‌’ గ్లింప్స్‌తో సంచలనం.. సందీప్‌ రెడ్డి వంగా నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌!

ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ గ్లింప్స్‌తో సంచలనం.. సందీప్‌ రెడ్డి వంగా నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా ‘స్పిరిట్‌’ (Spirit) నుంచి అభిమానులకు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) భారీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘యానిమల్‌’ (Animal) విజయంతో టాప్‌ రేంజ్‌లో ఉన్న సందీప్‌, ఇప్పుడు ప్రభాస్‌తో మరో సెన్సేషనల్‌ హిట్‌ అందించబోతున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతుండగా, నటీనటుల ఎంపిక కూడా తుది దశలో ఉంది.

అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సౌండ్‌ స్టోరీ ఆఫ్‌ ది ఫిల్మ్‌ స్పిరిట్‌’ పేరుతో ఓ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ప్రభాస్‌ ఒక ఐపీఎస్‌ అధికారిగా కనిపించగా, ప్రకాష్‌ రాజ్‌ వాయిస్‌ నరేషన్‌తో విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. ‘‘వీడి గురించి చాలా విన్నాను… యూనిఫామ్‌ ఉన్నా లేకపోయినా ప్రవర్తనలో తేడా ఉండదట… ఖైదీ యూనిఫామ్‌లో ఎలా ఉంటాడో చూద్దాం’’ అనే డైలాగ్‌తో సీన్‌ మొదలై, ప్రభాస్‌ చెప్పిన “మిస్టర్‌ సూపరింటెండెంట్‌, చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్‌ హ్యాబిట్‌ ఉంది” అనే మాట ప్రేక్షకులను కట్టిపడేసింది.

చిన్న గ్లింప్స్‌ అయినా ప్రేక్షకుల్లో అద్భుతమైన హైప్‌ను క్రియేట్‌ చేసింది. ‘‘ఇదే ఇలా ఉంటే టీజర్‌ ఎలా ఉంటుందో’’ అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన త్రిప్తి డిమ్రి (Triptii Dimri) హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్‌ ఒబెరాయ్‌, కాంచన‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular