HomeMovie News Telugu‘మీ ట్రోల్స్ నా వెంట్రుకతో సమానం’.. మిత్రమండలి ఈవెంట్‌లో బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు..

‘మీ ట్రోల్స్ నా వెంట్రుకతో సమానం’.. మిత్రమండలి ఈవెంట్‌లో బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించారు. తాజాగా విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా మంచి విజయం సాధించగా, ప్రస్తుతం ఆయన నిర్మాణంలో ఉన్న ‘మిత్రమండలి (Mithra Mandali)’ అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ పెరుగుతున్నాయి. దీనిపై బన్నీ వాసు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

బన్నీ వాసు మాట్లాడుతూ –
“ఇదేదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు, తొక్కేస్తే కిందపడిపోతాడు అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ అదంతా నా వెంట్రుకతో సమానం. నా సంస్కారం అలాంటిది – నేను ఇంకో వెంట్రుక తీసి ఇవ్వగలను, కానీ తల మీద ఉన్న వెంట్రుకనే తీసిస్తున్నాను. నేను ఎప్పటికీ పరిగెడుతూనే ఉంటాను. ఎవరు ఏం చేసినా, ఎంత ట్రోలింగ్ చేసినా నేను ఆగను.

ట్రోలింగ్ చేసే వాళ్లకు చెప్తున్నాను – ట్రోల్ చేయడానికి కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోండి! ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్‌గా ఉపయోగిస్తున్నారు. పొగడటానికి తక్కువ తీసుకోండి కానీ తిట్టడానికి మాత్రం ఎక్కువ తీసుకోండి.

సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు, లేకపోతే చూడరు. అంతే తప్ప దీనిపై పెద్దగా ఆలోచించను. మనం అందరం ఈ ఇండస్ట్రీలో కలిసే ఎదగాల్సిన వాళ్లం. ఎవరైనా నెగిటివ్ ప్రోపగండా చేయాలనుకుంటే పైన దేవుడు ఉన్నాడు, ప్రేక్షకులు ఉన్నారు – వారు నిర్ణయం తీసుకుంటారు,” అని బన్నీ వాసు తెలిపారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular