HomeMovie News Teluguవయసు ముదిరితే ముద్దులు పెట్టకూడదా?

వయసు ముదిరితే ముద్దులు పెట్టకూడదా?

యంగ్‌ హీరోలే ముద్దులు పెట్టాలా.? ఏజ్‌ బార్‌ అయినవాళ్లు ముద్దులు పెట్టకూడదా.? అని సూటిగా ప్రశ్నిస్తున్నాడు మన్మధుడు నాగార్జున. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఈ ప్రశ్న సంధించాడు. ‘మన్మధుడు 2‘ సినిమాలో నాగార్జున అమ్మాయిలకు తెగ ముద్దులు పెట్టేస్తున్నాడు. ఇంతవరకూ కార్తికేయ, విజయ్‌ దేవరకొండ లాంటి యంగ్‌ హీరోల లిప్‌లాక్స్‌ గురించే మాట్లాడుకున్నాం.

సీనియర్‌ హీరోలు బాలయ్య, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌ తదితర హీరోల లిప్‌లాక్స్‌ గురించి పెద్దగా చర్చల్లేవ్‌. కానీ, యంగ్‌ హీరోస్‌ని తలదన్నేలా నాగార్జున అమ్మాయిలతో లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించేశాడు ‘మన్మధుడు 2’ సినిమా కోసం. ఈ వయసులో ఆ రేంజ్‌లో లిప్‌లాక్స్‌ అవసరమా.? అంటూ నాగార్జున ట్రోలింగ్‌ కూడా ఎదుర్కొన్నాడు. అయితే, వయసు ముదిరిన వాళ్లు ముద్దులు పెట్టుకోకూడదా.? అని నాగ్‌ వేసిన ప్రశ్న భలే సూటిగా తగిలిందిలే. అవును ఎందుకు పెట్టుకోకూడదు.. అని అందరూ ఆలోచించేలా చేసింది నాగ్‌ ప్రశ్న.

ఇక సినిమాలో ఏజ్‌ బార్‌ పెళ్లి కొడుకులా నాగార్జున నటిస్తున్నాడు. పాపం తల్లి అతన్ని నువ్వింకా ‘వర్జిన్‌’ కదా అనుకుంటుంది. కానీ, అతనేమో, కనిపించిన అమ్మాయితో కసి కసిగా ముద్దు, ముచ్చట్లాడేస్తుంటాడు. ఇదీ ట్రైలర్‌లో చూపించిన కాస్త రొమాంటిక్‌ స్టఫ్ఫ్. కానీ, సినిమాలో ఇంకాస్త ఎక్కువ మసాలానే ఉంటుందట. కానీ, అదంతా జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే అంటున్నాడు నాగార్జున.

You May Like This
- Advertisment -spot_img

Most Popular