HomeMovie News Teluguగోవాలో జూదం.. జ‌గ్గూభాయ్ ఏం మార‌లేదు.

గోవాలో జూదం.. జ‌గ్గూభాయ్ ఏం మార‌లేదు.

జ‌గ‌ప‌తిబాబు వంద సినిమాలు చేసిన హీరో. నాన్న పేరు మోసిన నిర్మాత‌. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించాడు. సినిమాల్లోనే ఆడ‌బ్బు పోగొట్టుకున్నాడు. విలాసాల‌కు, జ‌ల్సాల‌కూ అల‌వాటు ప‌డి.. ఆస్తులు అమ్ముకున్నాడు. కాసినోలు ఆడి, మొత్తం జీరో అయిపోయాడు. ఈ విష‌యాల‌న్నీ ఒక‌ప్పుడు జ‌గ‌ప‌తిబాబునే ఒప్పుకున్నాడు. ఇక మీదట జ‌ల్సాల‌కు దూరంగా ఉంటాన‌ని – మీడియా ముఖంగానే చెప్పాడు.

అయితే జ‌గ‌ప‌తిబాబు ఏం మార‌లేదు. ఈమ‌ధ్య మ‌ళ్లీ ఆయ‌న గోవా వెళ్లి, కాసినోలో అడుగుపెట్టారు. ఆ ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో.. జ‌గ‌ప‌తిబాబుపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు వెలువ‌డ్డాయి. జ‌గ్గూభాయ్ ఏం మార‌లేద‌ని, సంపాదించిన డ‌బ్బుల‌న్నీ పోగొట్టుకోవ‌డానికి గోవా వెళ్లాడ‌ని అభిమానులు సైతం విమ‌ర్శించారు. ఆ పోస్టు పెట్టిన రెండు గంట‌ల త‌ర‌వాత మ‌రో పోస్ట్ పెట్టాడు.

హైద‌రాబాద్ తిరిగి వెళ్లిపోతున్నాన‌ని, ఇక ప‌నిమీద దృష్టి పెడ‌తాన‌ని దాని సారాంశం. ఇదంతా సోష‌ల్ మీడియా ఎఫెక్టా? లేదంటే ప‌ట్టుకెళ్లిన డ‌బ్బుల‌న్నీ అయిపోయాయా? అంటూ మ‌రోసారి హాట్ హాట్‌గా చ‌ర్చించుకుంటున్నారు. మొత్తానికి జ‌గ్గూభాయ్ ఏం మార‌లేదు. అవే విలాసాలు, అంతే హంగామా. డ‌బ్బు చేతికందితే… కొంత‌మంది అంతేనేమో..?

You May Like This
- Advertisment -spot_img

Most Popular