HomeMovie News Teluguమెగాస్టార్‌ ఈజ్‌ బ్యాక్‌: వాట్‌ ఏ మేకోవర్‌!

మెగాస్టార్‌ ఈజ్‌ బ్యాక్‌: వాట్‌ ఏ మేకోవర్‌!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని, కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, కొరటాల సినిమాలో మెగాస్టార్‌ ఎలా కనిపించబోతున్నారనే కదా అందరి ఆలోచన. అందుకు హింట్‌ దొరికేసిందిదిగో. సోషల్‌ మీడియాలో చిరంజీవికి సంబంధించిన కొన్ని ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

బ్లాక్‌ పోలో టీషర్ట్‌, కాంబినేషన్‌ జీన్స్‌, కూలింగ్‌ గ్లాస్‌, లైట్‌గా ఉన్న గెడ్డం.. స్టైలిష్‌గా స్పోర్ట్స్‌ క్యాప్‌.. ఇలా ఈ గెటప్‌లో చిరంజీవి ఎక్కడికో వెళుతూ కెమెరా కంటికి చిక్కి షాకిచ్చారు. బాస్‌ గెటప్‌లో మన బిగ్‌బాస్‌ ఇలా కెమెరాకి చిక్కితే ఊరుకుంటారా? ఇదిగో ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ట్రెండింగ్‌ చేసేశారు మెగా ఫ్యాన్స్‌. చాలా కాలం తర్వాత చిరంజీవిని ఈ తరహా గెటప్‌లో చూస్తున్న ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేవ్‌.

సడెన్‌గా మెగాస్టార్‌ వయసు 60ల నుండి ఓ పాతిక ముప్పై ఏళ్లు కిందికి జారిపోయిందనిపిస్తోంది బాస్‌నిలా చూస్తుంటే. ఇక అంతే, ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. కొరటాల తన సినిమాలో చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడో. సినిమా ఎలా ఉండబోతోందో. బాక్సాఫీస్‌ రికార్డుల రారాజు ఎలా రికార్డులు కొల్లగొట్టబోతున్నాడో.. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హీరోయిన్‌గా నయనతార పేరు ప్రచారంలో ఉన్నా, మరో భామ కోసం పరిశీలన జరుగుతోంది. ఇక ‘సైరా నరసింహారెడ్డి‘ని అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular