HomeMovie News Teluguపవర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌.!

పవర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌.!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని తెగ ఫిదా చేస్తున్నారు. ఎందుకంటారా.? తన లుక్స్‌తో. ఈ మధ్య పవన్‌ కళ్యాణ్‌ని గుబురు గెడ్డం, పంచె కట్టులో చూసి చూసి జనం బోరెత్తిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే విసుగెత్తిపోయారు. ఎందుకు అంత గుబురు గెడ్డం.. ఆ గెడ్డం వెనక రహస్యమేంటని ఎంతమంది అడిగినా ఒక్కటే సమాధానం చెబుతూ వచ్చారు.

కానీ, తాజాగా పవన్‌ కళ్యాణ్‌ లుక్స్‌ ఫ్యాన్స్‌లో కొత్త ఎనర్జీని నింపుతున్నాయి. పవర్‌స్టార్‌ అంటే ఇదీ. పవన్‌ కళ్యాణ్‌ అంటే ఇలాగే ఉండాలి.. అంటున్నారు. అమెరికాలో జరుగుతున్న తానా సభలకు తాజాగా పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగానే పవన్‌ లుక్స్‌ చర్చకొచ్చాయి. ఈ లుక్స్‌లో పవన్‌ని ఇలా చూస్తుంటే, మా హీరో ఈజ్‌ కమ్‌ బ్యాక్‌ అంటూ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. కానీ, పవన్‌ కళ్యాణ్‌ తన తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే ఉంటా.. రాజకీయాల్లోనే ఉంటా.. అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు.

ఇటీవల ఓ సందర్భంలో మెగా బ్రదర్‌ నాగబాబు కూడా పవన్‌ కళ్యాణ్‌ ఇకపై సినిమాల్లో నటించకపోవచ్చు అన్నట్లుగానే చెప్పారు. ఏదో ఎప్పుడైనా అలా అలా.. గెస్ట్‌ రోల్స్‌లో ఏమైనా మెరుస్తాడేమో కానీ, పూర్తి స్థాయి హీరోగా నటించే అవకాశం లేదన్నట్లు దాదాపు మెగా బ్రదర్‌ కన్‌ఫామ్‌ చేసేశారు. సో పవన్‌ కళ్యాణ్‌ తాజా లుక్స్‌ ఎన్నాళ్లో తెలియదు. కానీ, లైట్‌ గెడ్డంతో, జీన్స్‌ టీ షర్టులో పవన్‌ కళ్యాణ్‌ని అలా చూస్తుంటే నిజంగానే చాలా ముద్దొచ్చేస్తున్నాడు మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular