HomeMovie News Teluguకేన్స్‌లో ఐష్‌ మేనియా!

కేన్స్‌లో ఐష్‌ మేనియా!

కేన్స్‌లో ఇంతకవరకూ దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రాల జిగేళ్లు చూసేశాం. ఇక మిగిలుంది ఐష్‌. ఐశ్వర్యారాయ్‌. నిజానికి కేన్స్‌ అంటే ఐష్‌, ఐష్‌ అంటే కేన్స్‌. ఆ ఐష్‌ ఎంట్రీ కూడా షురూ అయ్యింది. కేన్స్‌లో రెడ్‌ కార్పెట్‌ని తన గోల్డెన్‌ అందాలతో ఐష్‌ మెరిపించేసింది. ఎప్పటి నుండో కేన్స్‌లో జ్యూరీ సభ్యురాలిగా కొనసాగుతోన్న ఐష్‌ ఈ సారి కూడా అంతే ఉత్సాహంతో అటెండ్‌ అయ్యింది. తన కూతురు ఆరాధ్యతో కలిసి అందంగా మెరిసిపోయింది. కూతురు ఉన్నా, ఎప్పటిలాగే ఐష్‌ ముందు ఆమె వయసు చిన్నబోయింది. అదేంటో వయసు పెరుగుతున్న కొద్దీ కొందరు ముద్దుగుమ్మల్లో అందం మరింత రెట్టింపు అవుతూ వస్తోంది.

ఆ ప్లేస్‌లో ఐశ్వర్యారాయ్‌దే మొదటి స్థానంగా చెప్పుకోవాలేమో. తాజాగా కేన్స్‌లో అందాల ఐశ్వర్యారాయ్‌ గోల్డెన్‌ డ్రస్సులో జిగేల్‌ అంటూ మెరిసిపోయింది. జీన్‌ లూయీ సబాజీ డిజైన్‌ చేసిన గోల్డెన్‌ గ్రీన్‌ ఫిష్‌ కట్‌ గౌట్‌లో ఐష్‌ అందాలు హాట్‌ హాట్‌ సాగరకన్యను తలపించేలా ఉన్నాయి. అందరికీ ఫ్లైయింగ్‌ కిస్తూ, రెడ్‌ కార్పెట్‌పై ఐష్‌ వయ్యారాలు పోయిన తీరు అందర్నీ విశేషంగా ఆకర్షించింది. ప్రస్తుతం ఐష్‌ ప్యారిస్‌ కాస్మోటిక్‌ సంస్థ లారియల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే, గ్లామర్‌ తారగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఐష్‌, ‘జజ్బా’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. తర్వాత సెలెక్టివ్‌గా మూవీస్‌ చేస్తూ కొన్ని కాస్మొటిక్‌ బ్రాండ్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular