HomeMovie News Teluguపాపం.. రవిప్రకాష్‌ దెబ్బకి బలైపోయిన శివాజీ.

పాపం.. రవిప్రకాష్‌ దెబ్బకి బలైపోయిన శివాజీ.

సినీ నటుడు శివాజీ, టీవీ9 వివాదంలో కేంద్ర బిందువుగా మారారు. నిజానికి మాజీ సీఈఓ రవిప్రకాష్‌, టీవీ9 వివాదానికి కారణం కాగా, ఇప్పుడు వ్యవహారమంతా శివాజీ కేంద్రంగానే నడుస్తోంది. శివాజీ, ఎప్పుడైతే టీవీ9 ఛానెల్‌కి దగ్గరయ్యారో, అప్పటినుంచే అసలు కథ మొదలైందంటూ తెలివిగా ఓ ‘కొత్త’ కథను కొందరు తెరపైకి తీసుకొచ్చారు. సినీ పరిశ్రమలో అంచలంచెలుగా ఎదిగిన శివాజీ గురించి చాలామందికి తెలుసు. ఊరికే టెంప్ట్‌ అయిపోతుంటాడాయన.

చిన్న విషయాల గురించి చాలా ఎక్కువగా ఆలోచించేసి, బోల్తా కొట్టేస్తుంటాడు. సరిగ్గా ఈ పాయింట్‌ పట్టుకుని రవిప్రకాష్‌, శివాజీని పావులా వాడుకుని తాను చక్కబెట్టాల్సిన వ్యవహారాల్ని చక్కబెట్టేశాడు. టీవీ9 ఛానెల్‌కి సంబంధించి లోగోల్ని కేవలం 99 వేల రూపాయలకే రవిప్రకాష్‌ అమ్మేసేందుకు ప్రయత్నించినా, టీవీ9 సంస్థకు సంబంధించి కొన్ని వాటాల్ని శివాజీ పేర బదలాయించడంలోగానీ.. రవిప్రకాష్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ సుస్పష్టం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే శివాజీని పక్కా ప్లానింగ్‌తో టీవీ9కి దగ్గరయ్యేలా చేసింది రవిప్రకాషేనని అర్థమవుతోంది.

ఓ రాజకీయ ప్రముఖుడు కూడా ఈ విషయంలో శివాజీని మునగచెట్టు ఎక్కించేశాడట. ఆపరేషన్‌ గరుడ వ్యవహారంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోనూ శివాజీని హీరోగా చూపించి, తెరవెనుకాల వ్యవహారాల్ని రవిప్రకాష్‌ చక్కబెట్టేయగా, ఇప్పుడది శివాజీ మెడకు చుట్టేసుకుంది. ఈ వివాదంలోంచి శివాజీ బయటపడ్డం అంత తేలిక కాదు. నమ్మి, నట్టేట్లో మునిగిపోయాడాయన.

You May Like This
- Advertisment -spot_img

Most Popular