HomeMovie News Teluguచైతూకీ స‌మంత‌కు గొడ‌వ‌ల‌ట‌

చైతూకీ స‌మంత‌కు గొడ‌వ‌ల‌ట‌

నాగ‌చైత‌న్య‌.. స‌మంత‌.  టాలీవుడ్‌లో మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అనిపించుకున్న జంట‌. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హాయిగా కాపురం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, స‌మంత గొడ‌వ ప‌డుతున్నార్ట‌. వీళ్లిద్ద‌రికీ క్ష‌ణం కూడా ప‌డ‌డం లేద‌ట‌.  ప్ర‌తీరోజూ.. ప్ర‌తీ నిమిషం క‌ల‌హాల‌తోనే కాపురం చేస్తున్నార్ట‌.  

అయితే… నిజ జీవితంలో కాదు. సినిమా జీవితంలో. నాగ‌చైత‌న్య – స‌మంత క‌ల‌సి ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. పెళ్ల‌య్యాక‌… చై, స‌మంత క‌ల‌సి న‌టిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాలో చై, స‌మంత నిజ జీవిత పాత్ర‌ల‌నే పోషిస్తున్నారు. అంటే.. భార్యా భ‌ర్త‌లుగా న‌టిస్తున్నారన్న మాట‌. అయితే.. ఈ సినిమాతో ఈ భార్యా భ‌ర్త‌లు గొడ‌వ ప‌డుతూనే ఉంటార్ట‌. పెళ్ల‌య్యాక‌…  అభిరుచులు క‌ల‌వ‌క‌పోతే  ఎన్ని తిప్ప‌లు ప‌డ‌తారో… ఇందులో చూపిస్తున్నార్ట‌. 

”ఈ సినిమాలో క‌థ ప్ర‌కారం భార్య భ‌ర్త‌ల‌కు ఒక్క క్ష‌ణం కూడా ప‌డ‌దు. నిజ జీవితంలో మేమెప్పుడూ గొడ‌వ‌లు ప‌డ‌లేదు. అయితే ఈ సినిమా కోసం మాత్రం…. గొడ‌వ ప‌డాల్సివ‌స్తోంది” అని చెబుతున్నాడు చై. 2019 వేస‌వికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular