HomeMovie News Teluguవిజయ్‌ ఈసారి కామ్‌గా కొట్టేసేలా ఉన్నాడు.!

విజయ్‌ ఈసారి కామ్‌గా కొట్టేసేలా ఉన్నాడు.!

‘గీత గోవిందం’ కలెక్షన్స్‌తో విజయ్‌ దేవరకొండ స్టార్‌డమ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో ‘నోటా’ సినిమాకి విజయ్‌ రౌడీస్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా స్టార్‌ హీరోల్నీ, వారి సినిమాల్నీ కూడా లెక్క చేయకుండా, అనవసరంగా కామెంట్స్‌ చేసే దుస్థితికి చేరిపోయారు. అయితే ‘నోటా’ రిజల్ట్‌ రివర్స్‌ గేర్‌ తీసుకోవడంతో అందరూ కామ్‌ అప్‌ అయిపోయారు. 

ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ సైలెంట్‌ అయిపోయాడు. ఆటోమెటిగ్గా ఆయన ఫ్యాన్స్‌ అయిన సోషల్‌ మీడియా రౌడీస్‌ కూడా జోరు తగ్గించేశారు. విజయ్‌ తాజా చిత్రం ‘ట్యాక్సీవాలా’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్నా, కానీ ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. 

‘గీత గోవిందం’, ‘నోటా’ సినిమాలకు చేసినంత ఓవరాక్షన్‌ చేయడం లేదు. ఆల్రెడీ ఈ సినిమా డిజిటల్‌ ప్రింట్‌ మొత్తం పైరసీ అయిపోయింది. దాదాపుగా చాలా మంది ఆ వీడియోని వీక్షించేశారు కూడా. అయితే ఏదో తెలియని నమ్మకం. ఈ సినిమాకి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసి ధైర్యంగా ధియేటర్స్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. 

ఇది నిజంగా సాహసోపేతమే. అయితే ప్రమోషన్స్‌ విషయంలో ఎలాంటి ఓవరాక్షన్‌ చేయకుండా మెల్లగా ఉన్నాడు విజయ్‌ దేవరకొండ. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అన్నట్లుగా విజయ్‌ దేవరకొండ సైలెన్స్‌ చూస్తుంటే ఏమో ఆయన పేరులో ఉన్న విజయం మరోసారి ‘ట్యాక్సీవాలా’ సినిమాతో ఆయన వైపు చూస్తుందేమో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular