HomeMovie News Teluguఆమె కళ్లుగీటితే వాళ్లకి నష్టమేంటీ.?

ఆమె కళ్లుగీటితే వాళ్లకి నష్టమేంటీ.?

అలా కన్ను గీటింది. కోట్లాది యువ హృదయాల్ని కొల్లగొట్టింది. ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలో ఓ సన్నివేశంలో భాగంగా హీరోని చూసి కన్ను గీటుతుందీ భామ. అప్పటి వరకూ ఈ బ్యూటీ ఎవ్వరికీ తెలియదు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రపంచమంతటా వీక్షించింది. సింగిల్‌ నైట్‌లో సెన్సేషనల్‌ అయిపోయింది. 

అయితే అలా కన్ను గీటడం నచ్చని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కోర్టులో ఫిటీషన్‌ వేశారు. ఆ కేసు నుండి ప్రియా వారియర్‌కు ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా ఫిటీషన్‌ వేసిన వారికి చుక్కెదురైంది. మీకు వేరే పని లేదా అని పిటీషన్‌ వేసిన వారికి న్యాయస్థానం వాతలు పెట్టింది. సినిమా వాళ్లకు వివాదాలు కొత్త కాదు. కొన్ని వివాదాలు హాస్యాస్పదంగా ఉంటాయి. వాటిలో ఇదొకటి. 

ఇదిలా ఉంటే, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆమెతో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ దాకా పోటీ పడుతోంది. కమర్షియల్‌ యాడ్స్‌లోనూ ఆమెకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదంతా జస్ట్‌ అలా కన్ను గీటినందుకు మాత్రమే. బీభత్సంగా ఎక్స్‌పోజింగ్‌ చేసేసినా, పెద్ద కమర్షియల్‌ హిట్‌ కొట్టినా ఈ స్థాయి పాపులారిటీ రావడం కష్టమే ఎవరికైనా. 

అలాంటిది అవేమీ లేకుండానే ఈ ముద్దుగుమ్మకొస్తున్న పాపులారిటీ చూసి ఆశ్చర్యపోవడమే అందరి వంతవుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular