HomeMovie News Teluguఇదీ నందమూరి కమిట్‌మెంట్‌.!

ఇదీ నందమూరి కమిట్‌మెంట్‌.!

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందడం, ఈ నేపథ్యంలో తీవ్రమైన విషాదం నెలకొంది నందమూరి కుటుంబంలో. హరికృష్ణ తనయుడు కళ్యాణ్‌రామ్‌, మరో కుమారుడు ఎన్టీఆర్‌ తండ్రిని కోల్పోయిన బాధని దిగమింగుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. 

అయితే సెట్స్‌పై ఉన్న సినిమాల షూటింగ్స్‌ నిమిత్తం ఈ ఇద్దరూ ఆ విషయాలను, ఆ బాధను పంటి బిగువున అణచిపెట్టి షూటింగ్‌కి హాజరు కాక తప్పడం లేదు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘అరవింద సమేత’ సినిమాలో నటిస్తున్నాడు. దసరాకి ఈ సినిమా రిలీజ్‌ కానుంది. హరికృష్ణ మరణం కారణంగా షూటింగ్‌కి కొంత గ్యాప్‌ ఇవ్వాలని అనుకున్నారట ‘అరవింద సమేత..’ దర్శక నిర్మాతలు. 

అవసరమైతే సినిమా రిలీజ్‌ని వాయిదా వేద్దామని భావించారట. అయితే తన కారణంగా సినిమా విడుదల ఆగకూడదనీ, ఎన్టీఆర్‌ షూటింగ్‌కి హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు. కళ్యాణ్‌రామ్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు. తన తదుపరి చిత్రం షూటింగ్‌ పాల్గొనబోతున్నాడట. 

ఇటీవల బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కీ ఇలాంటి విపత్కర పరిస్థితే ఎదురైంది. తల్లి అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో జాన్వీ పుట్టెడు దుంఖంలో మునిగిపోయింది. ఆ విషాదం నుండి తేరుకోకుండానే, తన తొలి చిత్రం ‘ధడక్‌’ షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మనసులోని బాధని ముఖంపై కనబడనీయకుండా చేసి, ఎట్టకేలకు సినిమా పూర్తి చేసింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular