HomeMovie News Telugu'దేవదాస్‌' పెగ్‌ అదిరింది బాస్‌.!

‘దేవదాస్‌’ పెగ్‌ అదిరింది బాస్‌.!

నాగార్జున – నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవదాస్‌’ ఫస్ట్‌ పెగ్‌ రిలీజైంది. అదేనండీ ఫస్ట్‌ టీజర్‌. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న ప్రోమో వచ్చినా ఇంతవరకూ మందు లాంగ్వేజ్‌నే వాడారు మరి. 

ఇకపోతే తాజాగా విడుదలైన ఈ ఫస్ట్‌పెగ్‌కి వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. ఒక్క యూ ట్యూబ్‌లోనే 1.3 మిలియన్‌ వ్యూస్‌ దాటేసింది. ఆ రేంజ్‌లో ఉంది మరి. ‘దాసూ.! ఏంటి సంగతి..?’ అంటూ నాగార్జున డైలాగ్‌తో ఈ టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. నానికి డైలాగులేం లేవు కానీ, పర్‌ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. నాని డాక్టరుగా, నాగార్జున డాన్‌గా నటిస్తున్నారు. అసలింతకీ ఓ డాన్‌కీ, డాక్టరుకీ ఏంటి సంబంధం.? అదీ ఇంత క్లోజ్‌గా గ్లాసు సంబంధం? అనేదే కథ. 

కథలో ట్విస్ట్‌లు చాలా చాలా ఉంటాయండోయ్‌. టోటల్‌ కథ మాత్రం ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అది మాత్రం పక్కా. నాని, నాగార్జున ఇంతకు ముందెన్నడూ కనిపించనంత జోష్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. చిత్ర విజయంపై యూనిట్‌ పూర్తి నమ్మకంగా ఉన్నారు. విభిన్న చిత్రాల దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ బ్యానర్‌లో అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఒక్క సాంగ్‌ మినహా దాదాపు చిత్రీకరణ పూర్తయ్యింది. 

సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మికా మండన్నా, ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular