HomeMovie News Teluguటాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్‌ సునామీ.!

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్‌ సునామీ.!

మామూలు నటి. ఏదో అవకాశాల కోసం తాపత్రయపడుతోంది. అంత సీను లేదు శ్రీ రెడ్డికి అని తక్కువగా అంచనా వేశారు. కానీ శ్రీరెడ్డి ఇదంతా ఏమీ ఆషామాషీగా చేసింది కాదని ఇప్పుడు తెలుస్తోంది. ఇంతవరకూ మాటలతోనే తూటాలు పేల్చిన ఈ నటి ఇప్పుడు ఫోటోలు, వాట్సాప్‌ ఛాటింగ్స్‌ దాకా చేరింది. దాంతో టాలీవుడ్‌లో రచ్చ రచ్చ జరిగిపోతోంది. 

ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కొడుకు, హీరో రానా తమ్ముడుతో శ్రీరెడ్డి క్లోజ్‌గా దిగిన ఫోటోలు రిలీజ్‌ చేసింది. అవిప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, కోన వెంకట్‌, సింగర్‌ శ్రీరామ్‌ చంద్ర, మరో నటుడు వివాహర్ష తదితరుల వాట్సాప్‌ ఛాటింగ్స్‌ని నెట్‌లో పెట్టేసింది. అయితే ఇవన్నీ నిజమా కాదా? అనే విషయం ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో రచ్చ మొదలైపోయింది. టాలీవుడ్‌లో టెన్షన్‌ స్టార్ట్‌ అయిపోయింది. 

మీడియాలో ఈమె గురించిన చర్చే. ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ అయితే ఇక వేరే న్యూస్‌ని కూడా పక్కన పెట్టేసి, టోటల్‌గా శ్రీరెడ్డి ముఖాముఖి చర్చా కార్యక్రమాలతో కాలక్షేపం చేసేస్తోంది. అసలింతకీ శ్రీరెడ్డి పోరాటం ఎందుకు? నిజంగానే తెలుగు వారికి అవకాశాలిప్పించడం కోసమేనా? ఒకవేళ తను పాపులారిటీ పెంచుకోవడానికా? ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. చూడాలి మరి ఈ శ్రీరెడ్డి లీక్స్‌ టాలీవుడ్‌లో ఎంత వరకూ దారి తీస్తాయో.

You May Like This
- Advertisment -spot_img

Most Popular