HomeMovie News Teluguగ్లామర్‌ 'నిధి' కెవ్వుకేకహే.!

గ్లామర్‌ ‘నిధి’ కెవ్వుకేకహే.!

అందాల భామ నిధి అగర్వాల్‌ ‘సవ్యసాచి’ చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. ఈ బ్యూటీ తెరంగేట్రానికి ముందే హల్‌చల్‌ మొదలెట్టేసింది. గ్లామర్‌తో నెట్టింట్లో తెగ హడావిడి చేసేస్తోంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ చిత్రం ఇంకా నిర్మాణ దశలో ఉంది. చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా విడుదల కాకముందే, ఈ బ్యూటీ తనను తాను సోషల్‌ మీడియాలో పరిచయం చేసేసుకుంటోంది. వట్టి పరిచయమేనా, తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని ఒక్కొక్కటి ఎగ్జిబిట్‌ చేస్తూ, ఆల్రెడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచేసుకుంటోంది. ఇప్పటికే ఈ రకంగా గ్లామర్‌ తళుకులతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ ఇక ‘సవ్యసాచి’తో హిట్‌ కొట్టిందంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదంతే అంటున్నారు అమ్మడి గ్లామర్‌ టాలెంట్‌ చూసి. తాజాగా నిధి అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో చూస్తే ఆహా ఈ గ్లామర్‌ నిధిని తమ సినిమాలో బంధించి తీరాల్సిందే అనిపించేలా ఉంది. జీన్స్‌ బోటమ్‌, వైట్‌ షర్ట్‌లో హాట్‌ హాట్ట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular