HomeMovie News Teluguరకుల్‌ని ఓదార్చుతున్న ఆ మెగా హీరో ఎవరు?

రకుల్‌ని ఓదార్చుతున్న ఆ మెగా హీరో ఎవరు?

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న టైంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌పై మోజుతో ‘అయ్యారీ’ సినిమాకి సైన్‌ చేసింది. భారీగా ఆశలు పెట్టుకుని బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్‌కి ‘అయ్యారీ’ బాగా నిరాశపరిచింది. సరికదా.. బాలీవుడ్‌ బాట పట్టాక, తెలుగులో రకుల్‌ని పక్కన పెట్టేశారు. అలా ప్రస్తుతం రకుల్‌ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకుండా పోయిందిప్పుడు. తమిళంలో రెండు చిత్రాల్లో అయితే నటిస్తోంది కానీ, వాటిలో ఒక సినిమాలోనే రకుల్‌ సోలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇదిలా ఉంటే, తెలుగులో ఓ మెగా హీరో రకుల్‌ప్రీత్‌సింగ్‌కి పిలిచి ఆఫర్‌ ఇచ్చాడనీ తాజాగా ఓ గాసిప్‌ స్ప్రెడ్‌ అవుతోంది. ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మెగా ఫ్యామిలీలో చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌తో నటించింది. వీరిలో చరణ్‌తో ‘బ్రూస్‌లీ’, ‘ధృవ’ రెండు సినిమాల్లో నటించింది రకుల్‌. బన్నీతో ‘సరైనోడు’తో హిట్‌ కొట్టింది. తేజుతో ‘విన్నర్‌’లో నటించి, ఓకే అనిపించుకుంది. అయితే తాజాగా రకుల్‌కి ఆఫర్‌ ఇచ్చిన ఆ మెగా కాంపౌండ్‌ హీరో ఎవరో కానీ, ప్రస్తుతానికి సస్పెన్స్‌ కొనసాగుతోంది ఆ విషయంలో. అయితే ఆ సినిమాలో రకుల్‌ నటించేది హీరోయిన్‌గా కాదనీ, ఓ స్పెషల్‌ సాంగ్‌లోననీ మరో పక్క ప్రచారం జరుగుతోంది. 

ఈ సంగతిలా ఉంటే, ప్రస్తుతం మెగా కాంపౌండ్‌ హీరోల్లో జోరు మీదుంది మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. ‘తొలిప్రేమ’ సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడీ మెగా రాకుమారుడు. మరింతకీ రకుల్‌కి ఛాన్స్‌ ఇచ్చిన మెగా హీరో ఎవరబ్బా? ఎవరైనా కానీ మొత్తానికి మెగా కాంపౌండ్‌ హీరోనే అని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే, రకుల్‌కి మళ్లీ టాలీవుడ్‌లో మెగా ఎంట్రీ షురూ అయినట్లే!

You May Like This
- Advertisment -spot_img

Most Popular